News August 25, 2025
ఎమ్మెల్యే కళా వెంకట్రావు సోదరడి మృతి

చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నయ్య నీలం నాయుడు (75) అనారోగ్య కారణంగా సోమవారం ఉదయం రేగిడిలో మృతి చెందారు. ఈయన గతంలో రేగిడి గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. స్వస్థలం రేగిడిలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నీలం నాయుడు మృతితో రేగిడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News August 25, 2025
రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది: కలెక్టర్

జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, జిల్లాకు సరిపడా యూరియా ఇప్పటికే అందుబాటులో ఉందని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 32 వేల మెట్రిక్ టన్నుల వరకు పంపిణీ చేశామన్నారు. మరో 3 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం రైతులే నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.
News August 25, 2025
విజయనగరం: ‘60% పెరిగిన మహిళా ప్రయాణికులు’

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తొలివారం 3,26,939 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నాలుగు రకాల బస్సుల్లో మొత్తం 6,17,206 మంది ప్రయాణించగా.. వారిలో వీరిలో 3,26,939 మంది మహిళలు ఉన్నారన్నారు. టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషులు 2,90,499 మంది ఉన్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 60% పెరిగినట్లు ఆమె తెలియజేశారు.
News August 25, 2025
VZM: ప్రతి నెల 3వ శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్

ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం తెలిపారు. ఎంప్లాయిస్ గ్రీవెన్స్ సెప్టెంబరు 19న కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు.