News August 25, 2025
మర్రిపూడి: గ్రామం ఒకటే.. పంచాయతీలు రెండు

మర్రిపూడి మండలంలో ఓ ఊరు రెండు పంచాయతీల్లో ఉంటోంది. ఈ రెండు పంచాయతీల మధ్య పొదిలి కొండపి రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు తూర్పు వైపున జువ్విగుంట, పడమర వైపు రావెళ్లవారిపాలెం పంచాయతీలు ఉన్నాయి. పొదిలి వైపు వెళ్లే వాళ్లు రావెళ్లవారిపాలెంలో బస్సు ఎక్కాలి. అదే బస్సు రిటర్న్‌లో ఆ గ్రామంలో దిగాలంటే జువ్విగుంటలో దిగాలి.
Similar News
News August 26, 2025
విద్యార్థులు లక్ష్యసాధన చేయాలి: కలెక్టర్

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు సూచించారు. సోమవారం ఒంగోలులో వసతి గృహాలకు సంబంధించి విద్యార్థులను JD శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.
News August 25, 2025
ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష.!

ఫోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.7వేల జరిమానాను విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితుడికి జైలు శిక్ష ఖరారుకావడంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమంతునిపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తి, 2000 సంలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనితో కేసు నమోదు కాగా, సదరు వ్యక్తికి మూడేళ్ల శిక్ష ఖరారైంది.
News August 25, 2025
జిల్లాలో సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగు నేత్రదాన పక్షోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 40 జాతీయ పక్షోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేత్రదానం చేయండి.. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించండి అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించాలన్నారు. మరణానంతరం 6-8 గంటల్లో నేత్రదానం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.