News August 25, 2025
త్వరలో మదనపల్లె జిల్లా ప్రకటన..?

మదనపల్లె జిల్లా ఏర్పాటుపై త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు అంతర్గతంగా అధికారులు పనిచేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. జిల్లా హద్దులపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారంట. మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లెతో కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది.
Similar News
News August 26, 2025
ఆగస్టు 26: చరిత్రలో ఈ రోజు

1910: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జననం(ఫొటోలో)
1920: కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం
1963: సినీ నటుడు సురేశ్ జననం
1982: దేశంలో తొలి ఓపెన్ యూనివర్సిటీ డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభం
* మహిళా సమానత్వ దినోత్సవం
* అంతర్జాతీయ కుక్కల దినోత్సవం
News August 26, 2025
ఇకపై ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందొచ్చు: కలెక్టర్

జిల్లాలో పెన్షన్ గ్రహీతలు ఇకపై బయోమెట్రిక్ సమస్యలు లేకుండా ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పోస్టుమాస్టర్లకు ముఖ గుర్తింపు పరికరాలను అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కొత్త విధానం వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ సాంకేతికతతో పెన్షన్ చెల్లింపులో పారదర్శకత, వేగం పెరుగుతాయని తెలిపారు.
News August 26, 2025
NZB: కొండెక్కిన పూల ధరలు

వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.