News April 2, 2024

అనంతసాగరం: జాతీయ రహదారిపై లారీ బోల్తా

image

అనంతసాగరం మండలం ఉప్పలపాడు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు వైపు నుంచి బద్వేలు వైపు వెళ్తుండగా సిలికా లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News April 21, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

image

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

News April 21, 2025

NLR: వాగులో మహిళ మృతదేహం

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం మహిళ మృతదేహం కలకలం రేపింది. అనికేపల్లి సమీపంలోని కర్రోడ వాగులో మహిళ మృతదేహం లభ్యమైంది.  గ్రామస్థులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వెంకటాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

నెల్లూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 668 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-264 ➤ BC-A:50 ➤ BC-B:61
➤ BC-C:8 ➤ BC-D:46 ➤ BC-E:26
➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:40
➤ SC-గ్రేడ్3:51 ➤ ST:43 ➤ EWS:65
➤ PH-విజువల్:2 ➤ PH- హియర్:2
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16155982>>ఇక్కడ <<>>క్లిక్ చేయండి.

error: Content is protected !!