News August 25, 2025
నగరంలో లాగింగ్ పాయింట్లు 3 రెట్లు పెరిగాయి

నగరంలో వర్షం వస్తే బయటకు వెళ్లాలంటేనే భయం. కారణం వాటర్ లాగింగ్ పాయింట్లు HYDలో పెరగడం గతంలో వాటర్ లాగింగ్ పాయింట్లు 144 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 436కు పెరిగినట్లు తేలింది. దీంతో అధికారుల్లో ఒక రకమైన ఆందోళన, అన్ని చోట్లా నీరు నిలిచిపోతే నగరం ఏమైపోతుందన్న భయం.. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల సర్వేలో ఈ వివరాలు తెలిశాయని సమాచారం.
Similar News
News August 27, 2025
ఖైరతాబాద్ గణేశ్.. ఒక్క అడుగుతో ప్రారంభమై

1954లో ఒక్క అడుగుతో సింగరి శంకరయ్య కృషితో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ చరిత్ర నేటికీ పదిలంగా కొనసాగుతోంది. 2014లో 60 ఏళ్లు పూర్తైనందున 60 ఫీట్లు, 2024లో 70 ఏళ్లు పూర్తైనందున 70 ఫీట్ల గణపతిని ప్రతిష్ఠించారు. ఈఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో యుద్ధాలు ముగిసి శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ.. 69 ఫీట్ల విశ్వశాంతి మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు.
News August 27, 2025
HYD: గణపయ్యా.. తడవనివ్వనయ్యా

HYDలో ఓ దిక్కు భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు యువకులను వినాయక చవితి ఉత్సాహం అలరిస్తోంది. ఈ వర్షాన్ని లెక్కచేయకుండా గణపయ్యలను తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వార్షానికి తడవొద్దని వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ బాలుడు తన బైక్‌పై విగ్రహాన్ని మోసుకెళ్తూ, పూజ దుకాణం వద్ద ఆగి గొడుగు పట్టిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. భక్తి, ఆరాధన, కర్తవ్య సమ్మేళనంగా మారిన ఈ క్షణాన్ని Way2News కెమెరాలో బంధించింది.
News August 27, 2025
HYDకు ఆరెంజ్ అలెర్ట్.. అనవసరంగా బయటకు వెళ్లకండి!

నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తోంది. దాదాపు ఒంటిగంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు బేగంపేట్ వాతావరణశాఖ తెలిపింది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లితో సహా రంగారెడ్డిలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాలకూ ఆరెంజ్ అలెర్ట్ ఉందని, అవసరమైతే కానీ బయటకు వెళ్లొద్దని సూచించారు.