News August 25, 2025
కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్: NZB ఎంపీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. సోమవారం నిజామాబాదులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.
Similar News
News August 26, 2025
NZB: CP ఎదుట 28 మంది బైండోవర్

గణేశ్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట 28 మందిని బైండోవర్ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన DJ ఆపరేటర్లు, DJ యజమానులు, ట్రబుల్ మాంగర్స్‌ను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్ప్రవర్తనను కొనసాగించాలని సీపీ ఆదేశించారు.
News August 26, 2025
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేశ్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు.
News August 26, 2025
NZB: కొండెక్కిన పూల ధరలు

వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.