News August 25, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్‌కు ఆర్థికసాయం

TG: ‘పుష్ప-2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ‘మిషన్ వాత్సల్య పథకం’ కింద బాలుడికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.4,000 అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గడచిన 3 నెలలకుగాను రూ.12వేలు వారి ఖాతాలో జమ చేసింది. కాగా ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోగా, గాయపడిన శ్రీతేజ్ ఇంకా కోలుకుంటున్నాడు.
Similar News
News August 27, 2025
చైనా పట్ల ట్రంప్ డబుల్ యాక్షన్!

చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ వైపు 200% టారిఫ్స్ వడ్డిస్తామంటూనే మరోవైపు 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను చదువుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. కాగా ఇటీవల భారత్, చైనా పట్ల యూఎస్ కఠిన వైఖరి ప్రదర్శించింది. ఇంతలో మళ్లీ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
News August 27, 2025
క్యాబినెట్ భేటీ 30కి వాయిదా

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈనెల 29న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దాన్ని ఈనెల 30కి రీషెడ్యూల్ చేసింది. ఆ రోజు మ.ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
News August 27, 2025
ఖైరతాబాద్ గణేశుడి పూర్తి రూపం

TG: వినాయక నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. ఇవాళ ఆయన తొలి ఫొటో బయటకు వచ్చింది. ఇన్ని రోజులు నిర్మాణ దశలో కర్రలు ఉండగా ఇప్పుడు వాటిని తొలగించి స్వామివారి రూపాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మహాగణపతి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా పూజలందుకోనున్నారు. 69 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడి దర్శనానికి లక్షలాది మంది తరలిరానున్నారు.