News April 2, 2024

సిద్దిపేట జిల్లా వాసికి మిస్ టీన్ గెలాక్సీ టైటిల్

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో USAలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

Similar News

News March 15, 2026

పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. మధ్యాహ్నం పాఠశాల ముగిశాక పిల్లలు ఉత్సాహంతో చెరువులు, కుంటలకు ఈతకు వెళ్లే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సరదా ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన స్పష్టం చేశారు.

News March 14, 2026

జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.

News March 14, 2026

మెదక్ జిల్లాలో 99.83% హాజరు నమోదు: డీఈవో

image

మెదక్ జిల్లాలో పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు) పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిందని డీఈవో విజయ తెలిపారు. హవేలీఘన్పూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 11,239 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 11,220 మంది హాజరై 19 మంది గైర్హాజరయ్యారు. ఫెయిల్ అయిన వారిలో 14 మందికి 9 మంది పరీక్ష రాయగా హాజరు శాతం 99.83గా నమోదైందని పేర్కొన్నారు.