News August 25, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. రసాయనాలతో తయారైన విగ్రహాల వల్ల నీరు, నేల కలుషితం అవుతాయన్నారు. స్వచ్ఛమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలన్నారు.

Similar News

News August 27, 2025

కర్నూలు జిల్లాలో ఉచిత విద్యకు 1,082 మంది ఎంపిక

image

కర్నూలు జిల్లాలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)సీ కింద 1,082 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ తెలిపారు. ఎంపికైన వారు నేటి నుంచి 31వ తేదీ వరకు కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలన్నారు. సంబంధిత అధికారులు మండలాల వారీగా వివరాలను సేకరించి, నివేదికను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

News August 27, 2025

కొత్త మొల్గరలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కోయిలకొండ మండలం పారుపల్లి 76.3, MBNR అర్బన్ 62.0, భూత్పూర్ 55.3, మహమ్మదాబాద్ 49.0, మిడ్జిల్ 48.8, జడ్చర్ల 45.0, రాజాపూర్ 43.8, నవాబుపేట 34.5, బాలానగర్ 31.3, మూసాపేట 28.0, కౌకుంట్ల 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 27, 2025

నయీంనగర్‌: తృణ ధాన్యాలతో బొజ్జ గణపయ్య

image

తృణ ధాన్యాలతో కలిగే లాభాలను వివరించే ఓ ప్రయత్నంలో చిన్నారి పేపర్‌పై బొజ్జగణపయ్యను రూపొందించింది. హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయిప్రకాష్ కూతురు లాస్య వినూత్నంగా తృణధాన్య బొజ్జగణపయ్యను తయారుచేసింది. పండుగలు, పర్యావరణ హితం, సంస్కృతీ, సంప్రదాయాలు తదితర అంశాలపై లాస్య తరచుగా చిత్రాలు, పెయింటింగ్ తదితర కళా ప్రదర్శనలు చేస్తోందని ఆమె తండ్రి సాయిప్రకాష్ తెలిపారు.