News August 25, 2025
శాంతియుతంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
Similar News
News August 26, 2025
కామారెడ్డి: పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు పంపిణీ

కామారెడ్డి జిల్లాలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైజ్‌లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం అందజేశారు. కొత్త పరికరాలతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్లను పంపిణీ వేగవంతంగా చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ పనిచేయకపోతే, మంత్ర డివైజ్ ద్వారా ఫింగర్ ప్రింట్ ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయవచ్చన్నారు.
News August 26, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 26, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.48 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 26, 2025
నేడు JNTUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Adhoc-Contract-Base) పోస్టులకు ECE (4), CSE (3), సివిల్ (2), ఇంగ్లీష్ (1), ఫిజిక్స్ (1)కు నేడు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు కళాశాలలోని ప్రధాన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నారు.