News April 2, 2024

అన్నమయ్య జిల్లా సిద్ధమా?: YS జగన్

image

AP: సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో ముగించుకుని ఆరో రోజు అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. ఈక్రమంలో ‘అన్నమయ్య జిల్లా సిద్ధమా?’ అని జగన్ ట్వీట్ చేశారు. ప్రజలను కలుస్తూ పార్టీకి మద్దతివ్వాలని కోరుతూ ఆయన ఇవాళ జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. నిన్నటి సత్యసాయి జిల్లా సభకు భారీగా ప్రజలు తరలివచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

Similar News

News January 30, 2026

వరల్డ్ కప్ గెలిస్తే ఇంకేం చేస్తారో?.. పాక్ పీఎం ట్వీట్‌పై సెటైర్లు!

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్‌కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్‌పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.

News January 30, 2026

మధ్యాహ్నం కునుకు.. బ్రెయిన్‌కు ఫుల్ కిక్కు

image

మధ్యాహ్నం పూట చిన్న నిద్ర (Nap) వల్ల రాత్రి నిద్రతో సమానమైన ఎఫెక్ట్ ఉంటుందని రీసెర్చర్స్ తేల్చారు. వాళ్ల స్టడీ ప్రకారం.. రోజంతా పనులు, ఆలోచనల వల్ల బ్రెయిన్‌లోని నెర్వ్ సెల్స్ బాగా అలసిపోతాయి. ఇలాంటి టైమ్‌లో ఒక చిన్న కునుకు తీస్తే బ్రెయిన్ కనెక్షన్స్ మళ్లీ రీ-ఆర్గనైజ్ అవుతాయి. బ్రెయిన్‌పై లోడ్ తగ్గి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఇన్ఫర్మేషన్ మరింత ఎఫెక్టివ్‌గా స్టోర్ అవుతుంది.

News January 30, 2026

బోర్ కొడుతుందని ఖాళీ సమయంలో చదివి..!

image

రైలులో వెళ్లే సమయాన్ని చదివేందుకు కేటాయించి BARC శాస్త్రవేత్తగా ఎదిగిన వేలుమణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కోయంబత్తూర్‌ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకోగా పేదరికంతో హాస్టల్‌లో ఉండలేక రోజూ రైలులో ప్రయాణించేవారు. ఈ జర్నీలో రోజుకు 6 గంటల ఖాళీ టైమ్ దొరికేది. ఈ సమయంలో గణితం, ఫిజిక్స్‌ చదువుకున్నానని వేలుమణి ట్వీట్ చేశారు. ఆయన స్థాపించిన థైరోకేర్ టెక్నాలజీస్ నెట్‌వర్త్ రూ.5వేల కోట్లు.