News August 25, 2025
ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు ఉన్నారు. ఈ సాయంత్రం న్యాయ నిపుణులతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం బిహార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొననున్నారు.
Similar News
News August 27, 2025
SHOCKING: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రేఖ(55) 17వ బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. చెత్త ఏరుతూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు 16 మంది పిల్లలు పుట్టగా వారిలో ఐదుగురికి పెళ్లై పిల్లలున్నారు. తాజాగా రేఖ మరోసారి ఆస్పత్రికి వెళ్లి నాలుగో ప్రసవమని అబద్ధం చెప్పింది. తర్వాత నిజం తెలిసి వైద్యులే షాకయ్యారు. ‘మాకు ఇల్లు లేదు. పిల్లలను చదివించలేకపోయా. తిండి కోసమే రోజూ కష్టపడుతున్నా’ అని కావ్రా అన్నారు.
News August 27, 2025
సినిమా ముచ్చట్లు

* సెప్టెంబర్ 19న ‘పౌర్ణమి’ రీరిలీజ్
* ‘మిరాయ్’ ఓటీటీ పార్ట్‌నర్‌గా జియో హాట్‌స్టార్
* షారుఖ్, దీపికాలపై కేసు నమోదుకు భరత్‌పూర్ కోర్టు ఆదేశం
* ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
* ‘ఘాటీ’ ప్రమోషన్లకు అనుష్క శెట్టి దూరం
News August 27, 2025
పండగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వినాయక చవితి వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,02,440కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.350 ఎగబాకి రూ.93,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. KG సిల్వర్ రేట్ రూ.1,30,000గా ఉంది.