News April 2, 2024
‘ప్రాజెక్ట్ టైగర్’కు 51 ఏళ్లు.. 70% పులులు భారత్‌లోనే!

దేశంలో పులుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం APR 1, 1973న ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ 51ఏళ్లు పూర్తి చేసుకుందని ఓ IFS అధికారి ట్వీట్ చేశారు. మొత్తం 9 టైగర్ రిజర్వ్‌లలో పులుల సంరక్షణ కొనసాగుతోందన్నారు. దీంతో 2006లో 1411 పులులుండగా.. 2022లో వాటి సంఖ్య 3682కి చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70% ఇండియాలోనే ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News April 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 21, 2025
MBBS పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్.. 12 మందిపై వేటు?

AP: విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన MBBS పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ అంశంపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో కాలేజీ సూపరింటెండెంట్ ఎగ్జామినర్, డిప్యూటీ సూపరింటెండెంట్, 8 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు క్లర్క్‌లపై చర్యలకు వారు సిఫార్సు చేశారు. త్వరలోనే ఆ 12 మందిపై వేటు వేసే అవకాశం ఉంది.
News April 21, 2025
రోహిత్ ఫామ్‌లో ఉంటే గేమ్ నుంచి ప్రత్యర్థి ఔట్: హార్దిక్

రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MI కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశారు. అతను మంచి టచ్‌లోకి వస్తే ప్రత్యర్థి టీమ్ గేమ్ నుంచి ఔటైపోతుందని వ్యాఖ్యానించారు. CSKతో మ్యాచ్‌లో హిట్ మ్యాన్, సూర్య భాగస్వామ్యంతో విజయం తమవైపు వచ్చిందని చెప్పారు. తమ బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారని కొనియాడారు. కాగా CSKపై రోహిత్ 76* రన్స్ చేసిన విషయం తెలిసిందే.