News August 25, 2025

NZB: ప్రజావాణికి 102 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 102 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు అర్జీలు అందజేశారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News August 26, 2025

NZB: కొండెక్కిన పూల ధరలు

image

వినాయక చవితి పండగకు ముందే నిజామాబాద్‌లో పూల ధరలు కొండెక్కాయి. గులాబీలు, వివిధ రకాల చామంతుల ధరలు సోమవారం హోల్‌సెల్ మార్కెట్లో కిలో రూ.400 పలికాయి. బంతిపూలు రూ.200 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. పూలదండల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మరి పండుగ రోజు ధరలు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

News August 26, 2025

NZB: ఐటీఐలో స్పాట్ అడ్మిషన్ గడుపు పొడగింపు

image

కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ ITIలో ప్రవేశాల కోసం ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఎం.కోటిరెడ్డి తెలిపారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, బేసిక్ డిజైన్ వర్చువల్ వెరిఫైర్, అడ్వాన్స్ CNC మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్ ట్రేడ్స్‌లలో అడ్మిషన్లు జరుగుతాయన్నారు.

News August 26, 2025

భీమ్‌గల్: అంకం జ్యోతి ఫౌండేషన్‌కు డాక్టరేట్

image

భీమ్‌గల్‌కి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్‌కు వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాక్టర్ జ్యోష్ణ, రవి చేతుల మీదుగా ఫౌండేషన్ డైరెక్టర్ జ్యోతి అవార్డ్ అందుకున్నారు. 15 ఏళ్ల నుంచి పేద ప్రజలకు, వృద్ధులకు సహాయం చేస్తూ 3 సార్లు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని జ్యోతి తెలిపారు.