News August 25, 2025

జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు: భూమన

image

AP: YCP అధినేత జగన్‌పై TTD ఛైర్మన్ BR నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 27న జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ‘చంద్రబాబు పాలనలో కంటే YCP హయాంలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. CMగా జగన్ ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం ఆయన పాలనలోనే ప్రారంభమైంది’ అని వివరించారు.

Similar News

News August 27, 2025

4 టైటిల్స్.. అశ్విన్ IPL ప్రస్థానమిదే

image

IPLకు స్టార్ ప్లేయర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2009లో CSK తరఫున ఎంట్రీ ఇచ్చి 2010, 2011లో ఆ జట్టు IPL టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. CSK తరఫునే 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీస్ గెలిచారు. చెన్నై, RPS, పంజాబ్, DC, RR ఫ్రాంచైజీల్లో ఆడిన అశ్విన్ ఓవరాల్‌గా 221 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీశారు. చెన్నైతోనే మొదలైన IPL ప్రయాణం ఈ ఏడాది అదే జట్టుతో ముగిసింది. <<17531363>>FAREWELL ASH<<>>

News August 27, 2025

వినాయకుడికి సీఎం రేవంత్ పూజలు

image

TG: వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ విఘ్నేశుడికి పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. వేద పండితులు సీఎం కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి గీత, కుమార్తె నైమిషా రెడ్డి దంపతులు, మనవడు రేయాన్ష్ పాల్గొన్నారు.

News August 27, 2025

SHOCKING: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ

image

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రేఖ(55) 17వ బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. చెత్త ఏరుతూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు 16 మంది పిల్లలు పుట్టగా వారిలో ఐదుగురికి పెళ్లై పిల్లలున్నారు. తాజాగా రేఖ మరోసారి ఆస్పత్రికి వెళ్లి నాలుగో ప్రసవమని అబద్ధం చెప్పింది. తర్వాత నిజం తెలిసి వైద్యులే షాకయ్యారు. ‘మాకు ఇల్లు లేదు. పిల్లలను చదివించలేకపోయా. తిండి కోసమే రోజూ కష్టపడుతున్నా’ అని కావ్రా అన్నారు.