News August 25, 2025
మదనపల్లె: రక్త దానానికి యువత ముందుకు రావాలి: ఐశ్వర్య రాజేశ్

అపోహలు వీడి రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని సినీ నటి, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ పిలుపునిచ్చారు. సోమవారం మదనపల్లెలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను హెల్పింగ్ మైండ్స్ వారు కలిశారు. ఈ సందర్బంగా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆమె తెలుసుకుని అభినందించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని ఆమె కోరారు.
Similar News
News August 27, 2025
కామారెడ్డి: వరదలో చిక్కుకున్న 9 మంది సేఫ్

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్నసాగర్ శివారులో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇది వరకే నలుగురిని కాపాడగా, తాజాగా మరో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందాలు బృందాలు ఒడ్డుకు చేర్చాయి.
News August 27, 2025
MNCL: పోలీస్ కమిషనరేట్‌లో చవితి వేడుకలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి వినాయకుడికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
News August 27, 2025
నారాయణఖేడ్: వాగులను సందర్శించిన ఎస్పీ పారితోష్ పంకజ్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ మండలంలోని మద్వార్, హనుమంతరావుపేట గ్రామాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లోని రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని డీఎస్పీ వెంకట్ రెడ్డిని ఆదేశించారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.