News August 25, 2025

డిప్యూటీ స్పీకర్ RRRకు ఊరట

image

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. HYD గచ్చిబౌలి PSలో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. MPగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారని RRRతో పాటు ఆయన కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై FIR నమోదైంది. ఈ కేసును కొనసాగించలేనని కానిస్టేబుల్ బాషా వేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం FIRను కొట్టేస్తూ తీర్పిచ్చింది.

Similar News

News August 26, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. 30న సభ

image

TG: ఈనెల 30న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. దీనికి CM రేవంత్ సహా మహేశ్ కుమార్, మీనాక్షీ నటరాజన్ హాజరవుతారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళే మీటింగ్ ఉండాల్సింది. కానీ రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు CM బిహార్ వెళ్తున్నారు. దీంతో సభ తేదీని మార్చారు. ఇక రాహుల్‌కు సంఘీభావంగా ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదంతో ఈ సభను నిర్వహిస్తున్నామని PCC చెప్పినా త్వరలో జరగబోయే ఉపఎన్నికే టార్గెట్ అని తెలుస్తోంది.

News August 26, 2025

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు ఎన్నంటే?

image

TG: రాష్ట్రంలోని 315 ఎంబీఏ కాలేజీల్లో 25,991 సీట్లు, 90 ఎంసీఏ కాలేజీల్లో 6,404 సీట్లు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. MBA, ఎంసీఏల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. నిన్నటి వరకు 22,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,301 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.

News August 26, 2025

చైనా, నార్త్ కొరియాతో దోస్తీపై ట్రంప్ ఫోకస్

image

ప్రపంచమంతా తాను చెప్పినట్టే నడవాలనుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనా, నార్త్ కొరియాపై కన్నేశారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ప్రకటించారు. తన వద్ద కొన్ని వ్యూహాలున్నాయని, అవి అమలు చేస్తే ఆ దేశం నాశనమవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కానీ తాను అలా చేయనన్నారు. నార్త్ కొరియా నియంత కిమ్‌తోనూ ఈ ఏడాది భేటీ అవుతానని తెలిపారు. వీరిద్దరూ చివరిసారి 2019లో సమావేశమయ్యారు.