News August 25, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి వచ్చే అర్జీలు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 55 అర్జీలు వచ్చాయన్నారు.
Similar News
News August 26, 2025
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి: SP

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, అపసృతులకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వేడుకల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.
News August 26, 2025
టెక్కలిలో లెక్చరర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనశాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీజీలో కనీసం 55 శాతం మార్కులు, ఏపీ సెట్, యూజీసీ నెట్ అర్హత, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారు ఆగష్టు 30న కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావలన్నారు.
News August 26, 2025
జి.సిగడాం: కత్తిపోట్ల దాడిలో యువకుడు మృతి

కత్తిపోట్లకు గురైన ఓ యవకుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు జీసిగాడం(M) గెడ్డకంచారానికి చెందిన రాజశేఖర్, గొబ్బూరు గ్రామస్థుడు శంకర్‌ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజశేఖర్‌పై దాడి చేశారు. క్షతగాత్రుడుని స్థానికులు రిమ్స్‌లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.