News August 25, 2025

జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: విజిలెన్స్ ఎస్పీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ SP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనికి చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. దువ్వూరు మండలంలోని RSKల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు.

Similar News

News August 27, 2025

కడప జిల్లాలో ఫుట్ బాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణ: ప్రదీప్

image

సీనియర్ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ఇటీవల ఉత్కంఠంగా ముగిసిందని కడప జిల్లా అధ్యక్షుడు ఎం. డేనియల్ ప్రదీప్ తెలిపారు. ఫైనల్‌లో కడప జిల్లా ఫుట్ బాల్ అసోషియేషన్ జుట్టు అనంతపురం జట్టుతో తలపడిందన్నారు. రెండు జట్లు మధ్య మ్యాచ్ పూర్తి సమయానికి 0-0తో డ్రాగా ముగియడంతో పెనాల్టీ షూట్ అవుట్‌కు వెళ్లింది. కీలకమైన షూట్ అవుట్‌లో అనంతపురం జిల్లా జట్టు 3-2 తేడా విజయం సాధించిందన్నారు.

News August 27, 2025

కొండాపురంలో యాక్సిడెంట్.. మృతులు వీరే.!

image

కొండాపురంలోని లావునూరు రహదారిలో మంగళవారం రాత్రి బైకు – కారు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన శివకుమార్, రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. వారు దుగ్గుపల్లి నుంచి కొండాపురం వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.

News August 27, 2025

కడప జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ అకౌంట్లు

image

తన పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ అకౌంట్లు క్రియేట్‌ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తన ఫొటోలు వాడి ఇతరులను మోసం చేసేందుకు ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఫేక్‌ హ్యాకర్‌లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.