News August 25, 2025
J&K: ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్, వాట్సాప్‌పై నిషేధం

ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్, వాట్సాప్ వాడకాన్ని J&K ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ సమాచారాన్ని పరిరక్షించడం, డేటా ఉల్లంఘనలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఇకపై ప్రభుత్వ కార్యకలాపాల కోసం పెన్‌డ్రైవ్ వాడకూడదు. అధికారిక సమాచారాన్ని వాట్సాప్ లేదా ఇతర SM ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయకూడదు. డేటా షేరింగ్ కోసం క్లౌడ్-ఆధారిత GovDrive ప్లాట్‌ఫామ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
Similar News
News August 26, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ కొత్తగూడెం, BHPL, మహబూబాబాద్, ములుగు, WGLలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, HNK, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, MNCL, మేడ్చల్, NLG, నిర్మల్, PDPL, సిరిసిల్ల, రంగారెడ్డి, SDPT, సూర్యాపేట, యాదాద్రిలో పిడుగులతో వానలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 26, 2025
ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీల్లో ఛాన్స్.. శ్రీలీల ఏమన్నారంటే?

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డై అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
News August 26, 2025
గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.