News August 25, 2025
VZM: కలువ పువ్వు కోసం వెళ్లి మృతి

గంట్యాడ మండలం మదనాపురం గ్రామానికి చెందిన లగుడు సురేష్(40) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. గంట్యాడ ఎస్ఐ సాయి క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మదనాపురం గ్రామంలో కలువ పువ్వులు తీసుకునేందుకు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి మరణించాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News August 26, 2025
చిన్నారిని హింసించిన వ్యక్తికి జైలు శిక్ష

నాగులుప్పపాడు మండలం మాచవరంకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు సోమవారం 2 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది. ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న ముద్దాయి మహిళ కూతురైన చిన్నారిని తమకు అడ్డుగా ఉందని పలుమార్లు హింసించాడు. విచారించిన కోర్టు సాక్షదారాలు పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కోమల వల్లి తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ తెలిపారు.
News August 26, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ కొత్తగూడెం, BHPL, మహబూబాబాద్, ములుగు, WGLలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, HNK, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, MNCL, మేడ్చల్, NLG, నిర్మల్, PDPL, సిరిసిల్ల, రంగారెడ్డి, SDPT, సూర్యాపేట, యాదాద్రిలో పిడుగులతో వానలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News August 26, 2025
సిద్దిపేట: యూరియా పక్కదారి పట్టిందా..?

యూరియాకు భారీ డిమాండ్ ఉండడంతో జిల్లాలో పక్కదారి పట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూలో రోజుల తరబడి ఎదురుచూసిన యూరియా రైతులకు అందడం లేదు. ఇక్కడికి రావాల్సిన నిల్వలు దారిమలిస్తున్నారా లేక కోటానే తగ్గించారా అనే విషయం తెలాల్సి ఉంది. ఈ నెలలో 13,090 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 2,920 టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. యూరియా సరఫరా పై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.