News August 25, 2025
NGKL: ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 39 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు తీరుతాయని ప్రజలు ఎంతో ఆశతో వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు.
Similar News
News August 26, 2025
10,270 ఉద్యోగాలు.. ఎల్లుండితో ముగియనున్న గడువు

IBPS క్లర్క్ పోస్టులకు ఎల్లుండితో దరఖాస్తు గడువు ముగియనుంది. దేశంలోని పలు బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉండగా ఏపీలో 367, టీజీలో 261 ఖాళీలు ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్ట్ చేస్తారు. వెబ్‌సైట్: <
>>SHARE IT
News August 26, 2025
ఉదయమే ఈ ప్రమాదం ఎక్కువ: వైద్యులు

ఉదయం వేళల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. మేల్కొనే సమయంలో గుండెపై ఒత్తిడి పడి, రక్తపోటు పెరిగే అవకాశం ఉందంటున్నారు. నిద్ర లేచిన 0-100 సెకన్ల వ్యవధిలో, ఉదయం 7-11 గంటలతో పాటు. సాయంత్రం 5-6 గంటల సమయంలోనూ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రమాదాన్ని తగ్గించేందుకు నిద్ర లేవగానే నీరు తాగడం, సమయానికి మెడిసిన్ తీసుకోవడం, ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
News August 26, 2025
చిన్నారిని హింసించిన వ్యక్తికి జైలు శిక్ష

నాగులుప్పపాడు మండలం మాచవరంకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు సోమవారం 2 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది. ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న ముద్దాయి మహిళ కూతురైన చిన్నారిని తమకు అడ్డుగా ఉందని పలుమార్లు హింసించాడు. విచారించిన కోర్టు సాక్షదారాలు పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కోమల వల్లి తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ తెలిపారు.