News August 25, 2025
లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News August 27, 2025
పండగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వినాయక చవితి వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,02,440కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.350 ఎగబాకి రూ.93,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. KG సిల్వర్ రేట్ రూ.1,30,000గా ఉంది.
News August 27, 2025
తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప.గో, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది.
News August 27, 2025
ఖైరతాబాద్ మహాగణపతి ముందే మహిళ ప్రసవం

TG: వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహా గణపతి వద్ద అద్భుతం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన నిండు గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చున్న సమయంలో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తల్లీబిడ్డలను తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. గణనాథుడి ముందే పుట్టిన ఆ చిన్నారిది ఎంతో అదృష్టమని భక్తులు తెలిపారు.