News August 25, 2025

భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జలవనరులు, గ్రామీణ నీటిపారుదల, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆమె ఆదేశించారు. సోమవారం భూగర్భ జలవనరుల పరిరక్షణ, ఈపీటీఎస్, స్వామిత్వా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Similar News

News August 26, 2025

అమరావతి పనుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్

image

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి CRDA తన కొత్త రాయపూడి కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇది 360° పర్యవేక్షణ, రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, పచ్చదనం ట్రాక్ చేయడం వంటి నెలవారీ పురోగతి నివేదికలను రోజువారీగా అందించడం కోసం CCTV కెమెరాలు, డ్రోన్‌లను ఉపయోగిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు పనుల పురోగతి తెలుసుకునేందుకు మరింత వీలుకానుంది.

News August 26, 2025

GNT: పండగలకు మరుగైన మామిడి తోరణాలు

image

పండగ వచ్చిందంటే చాలు, ఇంటిల్లిపాది పచ్చని మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించేవారు. ఆ పచ్చని తోరణాలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచేవి. ఒకప్పుడు ఇరుగుపొరుగు ఇళ్లలో మామిడి ఆకులను పంచుకునేవారు. కానీ ఇప్పుడు తోరణాలను కూడా మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగల హడావుడిలో తోరణాలు కట్టడం, వాటిని పంచుకోవడం వంటి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. మీ బాల్యంలో తోరణాల కోసం ఏం చేశారో కామెంట్

News August 25, 2025

తెనాలి: వందేళ్లు దాటినా కష్టాలే.. పింఛన్ కోసం వృద్ధుడి ఆవేదన

image

తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.