News August 25, 2025
మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

AP: డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా రేపు(26.08.2025) మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేసి, మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు.
Similar News
News August 26, 2025
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలోని 315 ఎంబీఏ కాలేజీల్లో 25,991 సీట్లు, 90 ఎంసీఏ కాలేజీల్లో 6,404 సీట్లు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. MBA, ఎంసీఏల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. నిన్నటి వరకు 22,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,301 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.
News August 26, 2025
చైనా, నార్త్ కొరియాతో దోస్తీపై ట్రంప్ ఫోకస్

ప్రపంచమంతా తాను చెప్పినట్టే నడవాలనుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనా, నార్త్ కొరియాపై కన్నేశారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ప్రకటించారు. తన వద్ద కొన్ని వ్యూహాలున్నాయని, అవి అమలు చేస్తే ఆ దేశం నాశనమవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కానీ తాను అలా చేయనన్నారు. నార్త్ కొరియా నియంత కిమ్‌తోనూ ఈ ఏడాది భేటీ అవుతానని తెలిపారు. వీరిద్దరూ చివరిసారి 2019లో సమావేశమయ్యారు.
News August 26, 2025
మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కన్వీనర్ సూచనలు

AP: * ఇవాళ మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి కాల్ <
* ఎల్లుండి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
* ఆలోపు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు లాగిన్ ద్వారా సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
* వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సినవి కులం సర్టిఫికెట్(వర్తిస్తే), అంగవైకల్య ధ్రువీకరణ పత్రం(వర్తిస్తే), కాల్ లెటర్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లు, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు.