News August 25, 2025
WNP: ముఖ చిత్ర గుర్తింపుతో పింఛన్లు పంపిణీ

వనపర్తి జిల్లాలో సామాజిక పింఛన్లు ఇక నుండి ముఖ చిత్ర గుర్తింపు ద్వారా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇక నుంచి వెలి ముద్రల గుర్తింపు ఇబ్బంది లేకుండా ముఖ చిత్రం గుర్తింపు ద్వారా పోస్టాఫీసుల్లో పింఛన్లు ఇవ్వనున్నారు. దీనికోసం సోమవారం పోస్టాఫీస్ అధికారికి 74 ముఖ చిత్ర గుర్తింపు చేసే సెల్ ఫోన్లను కలెక్టర్ అందజేశారు. డీఆర్‌డీఓ, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News August 26, 2025
గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కాటారం డీఎస్పీ

వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ కోరారు. కాటారం షబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల గణేశ్ మండలి నిర్వాహకులతో సోమవారం సమాశేశం నిర్వహించారు. శాంతి కమిటీ సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పలు సూచనలు చేశారు. ప్రతి గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
News August 26, 2025
ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీల్లో ఛాన్స్.. శ్రీలీల ఏమన్నారంటే?

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డై అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
News August 26, 2025
ఖానాపూర్: నిస్సహాయ స్థితిలో వ్యక్తి మృతి!

కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫిట్స్ రావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని బండమీది మామిడి తండాకు చెందిన బానోతు శ్రీను(42)కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనుకు మధ్యాహ్నం సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తండ్రి లేవకపోవడంతో, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చారు.