News August 26, 2025
ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్: సీఎం CBN

AP: మహిళల సహకారంతో ‘స్త్రీశక్తి’ గ్రాండ్ సక్సెస్ అయిందని పథకంపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ‘ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తాం. స్త్రీశక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టండి. రాష్ట్ర మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారు’ అని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలవుతోన్న విషయం తెలిసిందే.
Similar News
News August 27, 2025
ఇంట్లోని గణేశ్ విగ్రహాన్ని ఎప్పుడు నిమజ్జనం చేయాలంటే?

ఇంట్లో పూజించుకున్న గణేశ్ విగ్రహాన్ని ఎప్పుడు నిమజ్జనం చేయాలనే సందేహం అందరిలో ఉంటుంది. పూజ చేయగలిగిన వాళ్లు ఇంట్లో కూడా నవరాత్రులు ఉంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అలా కుదరని వాళ్లు 3 రాత్రులు, 5 లేదా 7 రాత్రులు ఉంచుకోవచ్చు. అది కూడా కుదరదంటే ఈ పూట కూడా పూజ చేసి, రేపు ఉదయం ఉద్వాసన పలకొచ్చని చెబుతున్నారు. నవరాత్రులు కాకపోయినా ఒక్క రాత్రైనా గణేశ్ విగ్రహం ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News August 27, 2025
KTRపై Dy.CM భట్టి విక్రమార్క ఫైర్

TG: వరద సహాయక చర్యలపై <<17533837>>KTR<<>> అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. వాళ్లలాగా ఇంట్లో కూర్చోలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు CM ఆరా తీస్తున్నారు. నిన్న బిహార్ వెళ్లి సాయంత్రానికే తిరిగొచ్చారు’ అని తెలిపారు. వరదలు వస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని KTR విమర్శించిన సంగతి తెలిసిందే.
News August 27, 2025
US వస్తువులపై ఆధారపడటం తగ్గిద్దాం.. PMకి CTI లేఖ!

US 50% <<17529585>>టారిఫ్స్<<>>తో భారత్ ఎగుమతులపై ప్రభావంతో పాటు.. లక్షల ఉద్యోగాలు పోతాయని ‘ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ PM మోదీకి లేఖ రాసింది. లెదర్, టెక్స్‌టైల్స్, జ్యూవెలరీ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ట్రంప్ ఒత్తిడికి తలగ్గొద్దని, అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలంది. UK, జర్మనీ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల మార్కెట్లను ఎక్స్‌ప్లోర్ చేయాలని సూచించింది.