News April 2, 2024
ప్రకాశం: అక్కడ వైసీపీ ఖాతా తెరవలేదు

జిల్లాలో YCP ఆవిర్భావం నుంచి సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసింది. 2014లో మొత్తం 12 స్థానాలకు గాను 6 చోట్ల.. 2019లో 8 చోట్ల గెలిచింది. పర్చూరు, చీరాలలో YCP ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేశ్, TDP నుంచి ఏలూరి సాంబశివ రావు, పర్చూరులో యడం బాలాజీ TDP నుంచి కొండయ్య బరిలో ఉన్నారు. ఈసారి TDP పట్టు నిలుపుకుంటుందా, YCP పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.
Similar News
News March 18, 2026
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

ప్రకాశం భవనంలో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు 22(ఏ) కేసులు, మ్యుటేషన్లు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు వారాల గడువులోనే కేసులు పరిష్కరించాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఆలస్యం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు: దివ్యాంగుల సాధికారతకు ‘శక్తి’ పథకం ప్రారంభం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగుల భరోసా కోసం ‘శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, శిక్షణ, సామాజిక మద్దతు అందించి వారిని స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించనున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని దివ్యాంగుల స్వావలంబనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.