News August 26, 2025

పెద్దపల్లి: ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ

image

పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు, స్టాఫ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లోని అన్ని వసతులను పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్‌ డైట్‌ మెనూ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

Similar News

News August 27, 2025

రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌తో పృథ్వీ షా.. ఫొటో వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి, ఇన్‌ఫ్లూయెన్సర్ ఆకృతి అగర్వాల్‌ కలిసి వినాయక చవితి వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత జూన్‌లో వీరు ఒకేచోట కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా గతంలో నటి, మోడల్ నిధి తపాడియాతోనూ పృథ్వీ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతడు తాజాగా బుచ్చిబాబు టోర్నీలో సెంచరీ చేశారు.

News August 27, 2025

పెద్దాపూర్ కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి గల్లంతు

image

వినాయకుని విగ్రహాన్ని తీసుకువస్తుండగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీకర్ అనే యువకుడు గల్లంతయ్యాడు. రామారావుపల్లె వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 27, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత

image

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగిపోతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు 95,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 1,63,426 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రస్తుతం 15.723 TMCలకు చేరింది. ప్రరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.