News August 26, 2025
పీఎం మోదీ డిగ్రీ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమే: ఢిల్లీ హైకోర్టు

ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తుల అకడమిక్ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. PM మోదీ, స్మృతి ఇరానీ విద్యార్హత వివరాలను వెల్లడించాలని <<17514311>>RTI దాఖలవడంపై<<>> విచారణ జరిపింది. ‘వర్సిటీలు విద్యార్థులకు తప్ప ఇతరులకు మార్కులను బహిర్గతం చేయలేవు. మోదీ, స్మృతి విద్యార్హతలను వెల్లడించడంలో ప్రజాప్రయోజనం లేదు. RTI చట్టంలోని సెక్షన్ 8(1)(j) దీనికి మినహాయింపునిస్తుంది’ అని తెలిపింది.
Similar News
News August 27, 2025
వీధి వ్యాపారులకు లోన్లు.. కేంద్రం గుడ్ న్యూస్!

PM స్వనిధి పథకం గడువును కేంద్రం 2030 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో ₹15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో ₹25 వేలు, మూడో విడతలో ₹50,000 మంజూరు చేస్తారు. ఇప్పటివరకు తొలి విడతలో ₹10K, రెండో విడతలో ₹20K ఇచ్చేవారు. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయాలి.
News August 27, 2025
ఏపీకి NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి

AP: మహారాష్ట్ర గవర్నర్, NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు స్వాగతం పలికారు. మరోవైపు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి.
News August 27, 2025
భారీ వర్షాలు.. సెలవు ఇవ్వాలని డిమాండ్!

TG: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాలను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడగా, ఎల్లుండి యథావిధిగా జరగనున్నాయి.