News August 26, 2025
హైదరాబాద్ హాఫ్ మారథాన్‌లో కర్నూలు వాసి సత్తా

హైదరాబాద్‌లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ రేస్‌లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభ కనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్లు పరిగెత్తి, కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.
Similar News
News August 26, 2025
రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ప్రారంభించిన మంత్రి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.
News August 26, 2025
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్న

ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలలో ఆ పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్నను రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు సమివుల్లా, విజయేంద్ర, తిమ్మగురుడు, వీరేశ్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్నను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
News August 26, 2025
రాత్రి 10 తర్వాత వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఆపివేయాలి: ఎస్పీ

వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందామని, రాత్రి 10 గంటల తర్వాత వినాయక మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపివేయాలని విగ్రహ ఉత్సవ కమిటీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.