News April 2, 2024

MBNR: అత్యవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలని అన్నారు.

Similar News

News September 11, 2025

మహిళా సాధికారత కమిటీ సమావేశంలో డీకే అరుణ

image

ఢిల్లీలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో మహిళా సాధికారత కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈనెల 14, 15న మహిళా సాధికారత కమిటీ స్టడీ టూర్ నేపథ్యంలో APలో తిరుపతి వేదికగా కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. 2025లో ఎన్నికైన సభ్యుల పోర్టల్ ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.

News September 11, 2025

MBNR:జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్లు @4,99,852

image

మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఓటర్ల లెక్క తేలింది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 175 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 930 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈవో వెంకట రెడ్డి బుధవారం తెలిపారు. మొత్తం 4,99,852 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 2,48,222, మహిళలు 2,51,349, ఇతరులు 11 మంది ఉన్నారు. పురుషులకంటే 3,127 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

News September 11, 2025

గ్రామాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేయండి: చిన్నారెడ్డి

image

గ్రామాల్లో జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైందని, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చేలా అప్పట్లో రాజీవ్ గాంధీ రూపొందించారని గుర్తు చేశారు.