News April 2, 2024
గుంటూరు రైల్వే డివిజన్ చరిత్రలో ఇదే ప్రథమం

గుంటూరు రైల్వే డివిజన్‌కు 2024 మార్చి నెలలో రూ.47.9 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అధికమన్నారు. 3.364 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 21.6% వృద్ధి చెందిందన్నారు. దశాబ్దాల చరిత్ర తిరగరాసిందని తెలిపారు.
Similar News
News March 22, 2026
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..
News March 22, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన పడొద్దు: గుంటూరు JC

గుంటూరు జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ భరోసా ఇచ్చారు. గుంటూరు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీను శనివారం జేసీ తనిఖీ చేశారు. ఏజెన్సీలో ఉన్న కనెక్షన్లు, బుకింగ్ చేసినవి, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి బుక్ చేసిన వివరాలు అడిగి తెలుసున్నారు.