News August 26, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 26, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.44 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.48 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News August 26, 2025

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు ఎన్నంటే?

image

TG: రాష్ట్రంలోని 315 ఎంబీఏ కాలేజీల్లో 25,991 సీట్లు, 90 ఎంసీఏ కాలేజీల్లో 6,404 సీట్లు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. MBA, ఎంసీఏల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. నిన్నటి వరకు 22,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,301 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.

News August 26, 2025

చైనా, నార్త్ కొరియాతో దోస్తీపై ట్రంప్ ఫోకస్

image

ప్రపంచమంతా తాను చెప్పినట్టే నడవాలనుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనా, నార్త్ కొరియాపై కన్నేశారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ప్రకటించారు. తన వద్ద కొన్ని వ్యూహాలున్నాయని, అవి అమలు చేస్తే ఆ దేశం నాశనమవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కానీ తాను అలా చేయనన్నారు. నార్త్ కొరియా నియంత కిమ్‌తోనూ ఈ ఏడాది భేటీ అవుతానని తెలిపారు. వీరిద్దరూ చివరిసారి 2019లో సమావేశమయ్యారు.

News August 26, 2025

మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కన్వీనర్ సూచనలు

image

AP: * ఇవాళ మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి కాల్ <>లెటర్లు<<>>.
* ఎల్లుండి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
* ఆలోపు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు లాగిన్ ద్వారా సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
* వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సినవి కులం సర్టిఫికెట్(వర్తిస్తే), అంగవైకల్య ధ్రువీకరణ పత్రం(వర్తిస్తే), కాల్ లెటర్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లు, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు.