News August 26, 2025
కామారెడ్డి: పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు పంపిణీ

కామారెడ్డి జిల్లాలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైజ్‌లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం అందజేశారు. కొత్త పరికరాలతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్లను పంపిణీ వేగవంతంగా చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒకవేళ ఫేస్ రికగ్నిషన్ పనిచేయకపోతే, మంత్ర డివైజ్ ద్వారా ఫింగర్ ప్రింట్ ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయవచ్చన్నారు.
Similar News
News August 26, 2025
రంపచోడవరం: డిగ్రీ అడ్మిషన్లు నేడే చివరి తేదీ

రంపచోడవరం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ అని ప్రిన్సిపల్ డా.కె. వసుధ తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బొటని, జువాలజీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ మొత్తంగా ఏడు మేజర్ సబ్జెక్టులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు కళాశాలలో ఆన్‌లైన్ ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు.
News August 26, 2025
చైనా, నార్త్ కొరియాతో దోస్తీపై ట్రంప్ ఫోకస్

ప్రపంచమంతా తాను చెప్పినట్టే నడవాలనుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనా, నార్త్ కొరియాపై కన్నేశారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ప్రకటించారు. తన వద్ద కొన్ని వ్యూహాలున్నాయని, అవి అమలు చేస్తే ఆ దేశం నాశనమవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. కానీ తాను అలా చేయనన్నారు. నార్త్ కొరియా నియంత కిమ్‌తోనూ ఈ ఏడాది భేటీ అవుతానని తెలిపారు. వీరిద్దరూ చివరిసారి 2019లో సమావేశమయ్యారు.
News August 26, 2025
మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కన్వీనర్ సూచనలు

AP: * ఇవాళ మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి కాల్ <
* ఎల్లుండి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
* ఆలోపు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు లాగిన్ ద్వారా సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
* వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సినవి కులం సర్టిఫికెట్(వర్తిస్తే), అంగవైకల్య ధ్రువీకరణ పత్రం(వర్తిస్తే), కాల్ లెటర్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లు, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్‌లు, 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలు.