News August 26, 2025
మా పాలనలో దాదాపు 2 లక్షల టీచర్ల నియామకం: TDP

AP: డీఎస్సీకి పర్యాయపదంగా తమ పార్టీ మారిందని టీడీపీ ట్వీట్ చేసింది. TDP పాలనలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల టీచర్ల నియామకాలు చేసి చరిత్ర సృష్టించినట్లు Xలో పేర్కొంది. 1994లో 16,238 డీఎస్సీ ఉద్యోగాలతో మొదలైన ప్రస్థానం ఇంకా కొనసాగుతోందని తెలిపింది. లిమిటెడ్, స్పెషల్ రిక్రూట్‌మెంట్లతో కలపి 1,96,619 ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
Similar News
News August 26, 2025
అర్జున్‌కు ఎంగేజ్మెంట్ అయ్యింది నిజమే: సచిన్

తన కొడుకు అర్జున్ తెందూల్కర్‌కు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని సచిన్ టెండూల్కర్ ధ్రువీకరించారు. అర్జున్ ఎంగేజ్మెంట్ నిజంగా జరిగిందా? అని రెడిట్‌లో ఓ నెటిజన్ సచిన్‌ను ప్రశ్నించారు. దీనికి అవునని బదులిస్తూ, అర్జున్ జీవితంలో కొత్త అధ్యాయం కోసం తామంతా ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘయ్ మనవరాలైన సానియా <<17398912>>చందోక్‌ను<<>> అర్జున్ పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి ఎప్పుడనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.
News August 26, 2025
ఇవాళ అర్ధరాత్రి నుంచే US అదనపు టారిఫ్స్

భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు 25% టారిఫ్స్ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు US అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. డెడ్‌లైన్ తర్వాత తమ దేశంలోకి ప్రవేశించే దాదాపు అన్ని రకాల ఇండియన్ గూడ్స్‌కు పెంచిన సుంకాలు వర్తిస్తాయని తెలిపింది. కాగా ఇప్పటికే 25% టారిఫ్స్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇవి 50%కు చేరనున్నాయి. మరోవైపు ఈ అంశంపై PM మోదీ ఆఫీస్‌లో ఇవాళ కీలక మీటింగ్ జరగనుంది.
News August 26, 2025
భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ఇస్తారా?

AP: అర్ధరాత్రి నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాగే కొనసాగుతూ 20-25cmల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?