News August 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 26, 2025

ఇవాళ అర్ధరాత్రి నుంచే US అదనపు టారిఫ్స్

image

భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు 25% టారిఫ్స్ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు US అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. డెడ్‌లైన్ తర్వాత తమ దేశంలోకి ప్రవేశించే దాదాపు అన్ని రకాల ఇండియన్ గూడ్స్‌కు పెంచిన సుంకాలు వర్తిస్తాయని తెలిపింది. కాగా ఇప్పటికే 25% టారిఫ్స్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇవి 50%కు చేరనున్నాయి. మరోవైపు ఈ అంశంపై PM మోదీ ఆఫీస్‌లో ఇవాళ కీలక మీటింగ్ జరగనుంది.

News August 26, 2025

భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ఇస్తారా?

image

AP: అర్ధరాత్రి నుంచి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాగే కొనసాగుతూ 20-25cmల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?

News August 26, 2025

హైకోర్టును ఆశ్రయించిన శ్రీదేవీ భర్త బోనీ కపూర్

image

దివంగత నటి శ్రీదేవీ భర్త, నిర్మాత బోనీ కపూర్‌ మద్రాస్ HCని ఆశ్రయించారు. 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో శ్రీదేవీ కొనుగోలు చేసిన స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహశీల్దార్‌‌ను ఆదేశించింది. కాగా ముదలైర్ అనే వ్యక్తి వద్ద శ్రీదేవీ భూమి కొనగా ఇప్పుడు ఆయన కుమారులు స్థలంపై హక్కు తమదేనంటున్నారు.