News August 26, 2025
KMR: హత్యాయత్నం కేసులో.. ముగ్గురికి మూడేళ్ల జైలు

హత్యాయత్నం కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు KMR ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. 2021లో బిచ్కుంద మండలం ఖత్గాంకు చెందిన చందును పాత కక్షల కారణంగా రాథోడ్ శంకర్, రాథోడ్ మారుతి, గణేశ్‌లు దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వీరిని కోర్టులో హాజరుపరచగా సోమవారం తీర్పు వెలువరించారు.
Similar News
News August 27, 2025
ALLERT.. 3 రోజులు జాగ్రత్తగా ఉండండి: సిద్దిపేట CP

మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ ప్రజలకు సూచించారు. ప్రజలు పోలీసు అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలని కోరారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజర్లు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో ఇబ్బంది ఉంటే డయల్ 100 లేదా 87126 67100కు కాల్ చేయాలని సూచించారు.
News August 27, 2025
JGTL: చెరువులో లభ్యమైన గణనాథుడికి నేటికీ పూజలు!

JGTL జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో కాకతీయుల కాలంలో వెలికి తీసిన గణపతి రాతి విగ్రహం ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. చెరువు తవ్వే క్రమంలో లభించిన ఈ గణనాథుడు గ్రామంలోని చెరువు సమీపంలో కలువుదీరాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విరామంగా పూజలు స్వీకరిస్తున్నాడు. కాగా, గ్రామస్థులు ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహంతో పాటు అనేక విగ్రహాలు బయటపడ్డాయని పలువురు పెద్దమనుషులు తెలిపారు.
News August 27, 2025
జనగామ: మాకేవి పూజలు..!

జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో ఆధ్యాత్మిక గ్రామమైన నిడిగొండలో పదుల సంఖ్యలో గణపతి(వినాయకులు) మూర్తులు కొలువై ఉన్నారు. రాష్ట్రకూటుల కాలం నుంచి కాకతీయుల కాలం వరకు ఈ విగ్రహాలు పూజలు అందుకున్నాయి. కాలక్రమేణా ఈ విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోవడంతో పూజలకు నోచుకోవడం లేదు. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న వేళ ఈ విగ్రహాలకు మాత్రం పూజలు కరవయ్యాయి.