News August 26, 2025

ఇకపై ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందొచ్చు: కలెక్టర్

image

జిల్లాలో పెన్షన్ గ్రహీతలు ఇకపై బయోమెట్రిక్ సమస్యలు లేకుండా ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పోస్టుమాస్టర్లకు ముఖ గుర్తింపు పరికరాలను అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కొత్త విధానం వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ సాంకేతికతతో పెన్షన్ చెల్లింపులో పారదర్శకత, వేగం పెరుగుతాయని తెలిపారు.

Similar News

News August 26, 2025

శ్రీరాంపూర్: ‘మట్టి వినాయకులను పూజించాలి’

image

వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు మట్టి ప్రతిమలకు పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని సంస్థ డైరెక్టర్ (పా) గౌత‌మ్ పొట్రు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింగరేణి భ‌వ‌న్‌లో సోమవారం ఉద్యోగులు, అధికారులకు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వినాయక ప్రతిమలను చెరువులు, జలాశయాలలో నిమజ్జనం చేయడంతో జల కాలుష్యం కలుగుతుందన్నారు.

News August 26, 2025

HYD: గణనాథుడి విగ్రహాలకు రెక్కలొచ్చాయి!

image

ఈ ఏడాది గణనాథుడి విగ్రహాల ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కంటే 20 శాతానికి పైగా ధరలు పెరిగాయి. అయినప్పటికీ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో పెద్దఅంబర్‌పేట్, నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్, మియాపూర్, ధూల్‌పేట విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. 10 ఫీట్ల విగ్రహాలు గతేడాది రూ.40-42 వేలు ఉండగా.. ఈసారి రూ.50వేలు దాటింది. విగ్రహాలకు అదనపు అలంకరణలు, హంగూ ఆర్భాటాలకు అనుగుణంగా ధరలను పెంచారు.

News August 26, 2025

ఇవాళ అర్ధరాత్రి నుంచే US అదనపు టారిఫ్స్

image

భారత్‌పై ట్రంప్ విధించిన అదనపు 25% టారిఫ్స్ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు US అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. డెడ్‌లైన్ తర్వాత తమ దేశంలోకి ప్రవేశించే దాదాపు అన్ని రకాల ఇండియన్ గూడ్స్‌కు పెంచిన సుంకాలు వర్తిస్తాయని తెలిపింది. కాగా ఇప్పటికే 25% టారిఫ్స్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇవి 50%కు చేరనున్నాయి. మరోవైపు ఈ అంశంపై PM మోదీ ఆఫీస్‌లో ఇవాళ కీలక మీటింగ్ జరగనుంది.