News August 26, 2025
ఆగస్టు 26: చరిత్రలో ఈ రోజు

1910: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జననం(ఫొటోలో)
1920: కవి, రచయిత, పాత్రికేయుడు ఏల్చూరి సుబ్రహ్మణ్యం జననం
1963: సినీ నటుడు సురేశ్ జననం
1982: దేశంలో తొలి ఓపెన్ యూనివర్సిటీ డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ప్రారంభం
* మహిళా సమానత్వ దినోత్సవం
* అంతర్జాతీయ కుక్కల దినోత్సవం
Similar News
News August 26, 2025
మండలానికో జనఔషధి స్టోర్!

AP: పేదలపై భారం తగ్గేలా జనరిక్ ఔషధాలు విస్తృతంగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో జనఔషధి స్టోర్ పెట్టేందుకు ముందడుగు వేస్తోంది. ఈ స్టోర్ల కోసం బీసీ కార్పొరేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అనుమతులు ఇవ్వాలని CM CBN అధికారులను ఆదేశించారు. దీంతో తక్కువ ధరకే మెడిసిన్స్ లభించడమే కాకుండా, BC యువతకు విస్తృతంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
News August 26, 2025
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మరో క్యాంపస్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ HYDలో మరో భారీ క్యాంపస్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని సెంటారస్ బిల్డింగ్‌లో 3,4 అంతస్తుల్లో 2.65 లక్షల చ.అడుగుల స్పేస్‌ను లీజుకు తీసుకుంది. దీనికి రూ.1.77Cr అద్దె, నిర్వహణ వ్యయాలు, ఇతర ఛార్జీలు కలిపి నెలకు రూ.5.4Cr చెల్లిస్తోంది. HYDలోని ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అతిపెద్ద లీజు ఒప్పందాల్లో ఇదొకటి. మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే గచ్చిబౌలిలో ఆఫీస్ ఉంది.
News August 26, 2025
అర్జున్‌కు ఎంగేజ్మెంట్ అయ్యింది నిజమే: సచిన్

తన కొడుకు అర్జున్ తెందూల్కర్‌కు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని సచిన్ టెండూల్కర్ ధ్రువీకరించారు. అర్జున్ ఎంగేజ్మెంట్ నిజంగా జరిగిందా? అని రెడిట్‌లో ఓ నెటిజన్ సచిన్‌ను ప్రశ్నించారు. దీనికి అవునని బదులిస్తూ, అర్జున్ జీవితంలో కొత్త అధ్యాయం కోసం తామంతా ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘయ్ మనవరాలైన సానియా <<17398912>>చందోక్‌ను<<>> అర్జున్ పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి ఎప్పుడనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.