News August 26, 2025
గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.
Similar News
News August 26, 2025
యూరియా.. అన్నదాత ఆవేదన వినరా!

తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. రాత్రీపగలు తేడా లేకుండా అన్నదాతలు ఎరువుల దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. యూరియా పాపం కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ సర్కారే కృత్రిమ కొరత సృష్టిస్తోందని BJP అంటోంది. ఇక యూరియా కొరతకు BJP, కాంగ్రెస్సే కారణమని BRS మండిపడుతోంది. ఇలాంటి రాజకీయ విమర్శలకే పరిమితమైన పార్టీలు రైతుల సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదు.
News August 26, 2025
200% టారిఫ్స్ విధిస్తాం.. చైనాకు ట్రంప్ వార్నింగ్

USకు చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై ఆపేస్తే 200% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘వాళ్లు మాకు మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే 200% టారిఫ్స్ విధించడం లేదా ఇంకేదైనా చేస్తాం. కానీ ఆ సమస్య రాదని భావిస్తున్నాం’ అని అన్నారు. త్వరలో చైనాలో పర్యటిస్తానంటూనే హెచ్చరించడం గమనార్హం. కాగా చైనాలోనే అత్యధికంగా ఉత్పత్తయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆటోమోటివ్, డిఫెన్స్ తదితర పరిశ్రమలకు కీలకం.
News August 26, 2025
అంబానీ ‘వనతారా’పై విచారణకు సిట్ ఏర్పాటు

అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ‘వనతారా’పై విచారణకు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. దేశంతో పాటు విదేశాల నుంచి అక్రమంగా జంతువులను తీసుకొస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఇటీవల మహారాష్ట్ర నుంచి <<17321653>>మాధురి<<>> అనే ఏనుగును వనతారాకు తరలించడంపై దుమారం చెలరేగింది.