News August 26, 2025

గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: కాటారం డీఎస్పీ

image

వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ కోరారు. కాటారం షబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల గణేశ్ మండలి నిర్వాహకులతో సోమవారం సమాశేశం నిర్వహించారు. శాంతి కమిటీ సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పలు సూచనలు చేశారు. ప్రతి గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

Similar News

News August 26, 2025

చిట్వేల్ అడవుల్లో పెద్దపులి

image

చిట్వేల్, వెలిగొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. తిరుపతిలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. మార్చిలో పెద్దపులి జాడలు కనిపించాయని చెప్పారు. సీసీ కెమెరాల్లోనూ పెద్దపులి సంచార దృశ్యాలు రికార్డు అయ్యాయని తెలిపారు. అటవీ శివారు ప్రాంతంలోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News August 26, 2025

విజయవాడలో చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన

image

విజయవాడ సత్యనారాయణపురంలోని నోరీ ఆసుపత్రిలో తమ చిన్నారికి వైద్యం వికటించి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈనెల 19న చిన్నారి షన్విత దేవిని అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మంగళవారం ఉదయం పాప చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ట్రీట్‌మెంట్ సరిగా చేయకపోవడంతోనే పాప చనిపోయిందంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.

News August 26, 2025

28 నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఈ నెల 28 నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మంది అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మూడు ప్రాంతాలలో 54 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.