News August 26, 2025

అర్జీదారులతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

image

అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం అనంతరం కలెక్టర్, అధికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.

Similar News

News August 26, 2025

ఒంగోలు: 24 ఏళ్ల తర్వాత జైలుశిక్ష

image

హనుమంతునిపాడు మండలానికి చెందిన ధనేకుల తిరుపతయ్య 2000వ సంవత్సరం సెప్టెంబర్ 4న బాలిక ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూల్‌డ్రింక్ తీసుకుని తాగాడు. తర్వాత బాలికను బయటకు పిలిచి నోరు మూసిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. నేరం రుజువు కావడంతో 24 ఏళ్ల తర్వాత ఒంగోలు కోర్టు అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.7వేల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పింది.

News August 26, 2025

చిన్నారిని హింసించిన వ్యక్తికి జైలు శిక్ష

image

నాగులుప్పపాడు మండలం మాచవరంకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలు కోర్టు సోమవారం 2 సంవత్సరాలు జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది. ఓ మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న ముద్దాయి మహిళ కూతురైన చిన్నారిని తమకు అడ్డుగా ఉందని పలుమార్లు హింసించాడు. విచారించిన కోర్టు సాక్షదారాలు పరిశీలించి నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కోమల వల్లి తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని ఎస్పీ తెలిపారు.

News August 26, 2025

విద్యార్థులు లక్ష్యసాధన చేయాలి: కలెక్టర్

image

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థులకు సూచించారు. సోమవారం ఒంగోలులో వసతి గృహాలకు సంబంధించి విద్యార్థులను JD శీలం పరివర్తన భవనంలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.