News August 26, 2025

BIG ALERT.. అతి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News August 26, 2025

బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని BJP అధిష్ఠానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2020 నుంచి JP నడ్డా ఈ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి అధ్యక్షుడి ఎంపికకు ఇప్పటికే కొంతమందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాత జాతీయ, పలు రాష్ట్రాల అధ్యక్షుల నియామక ప్రక్రియ తిరిగి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాయి.

News August 26, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సుమోటోగా స్వీకరించిన NCW

image

TG: గర్భవతైన భార్య స్వాతిని భర్త ముక్కలుగా నరికి మూసీలో పడేసిన ఘటనను జాతీయ మహిళా కమిషన్(NCW) సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్‌కర్ లేఖ రాశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, పారదర్శకంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటు స్వాతి శరీర భాగాల కోసం SDRF బృందం మూసీలో గాలిస్తోంది.

News August 26, 2025

సాదియా అంకితభావం యువతకు స్ఫూర్తి: లోకేశ్

image

AP: IPF వరల్డ్ క్లాసిక్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ కాంస్య పతకం సాధించారు. ఆమెకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ‘అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించారు. దేశంతో పాటు మన మంగళగిరికి గర్వకారణంగా నిలిచారు. ఆమె అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని ఆకాంక్షించారు.