News August 26, 2025

రంపచోడవరం: డిగ్రీ అడ్మిషన్లు నేడే చివరి తేదీ

image

రంపచోడవరం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ అని ప్రిన్సిపల్ డా.కె. వసుధ తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బొటని, జువాలజీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ మొత్తంగా ఏడు మేజర్ సబ్జెక్టులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు కళాశాలలో ఆన్‌లైన్ ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News August 26, 2025

బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని BJP అధిష్ఠానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2020 నుంచి JP నడ్డా ఈ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి అధ్యక్షుడి ఎంపికకు ఇప్పటికే కొంతమందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాత జాతీయ, పలు రాష్ట్రాల అధ్యక్షుల నియామక ప్రక్రియ తిరిగి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాయి.

News August 26, 2025

సంగారెడ్డి: ‘పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరాలి’

image

సంగారెడ్డి జిల్లాలో 190 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు వెంటనే వారికి కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాలని సూచించారు. పొద్దున్నతి పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

News August 26, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సుమోటోగా స్వీకరించిన NCW

image

TG: గర్భవతైన భార్య స్వాతిని భర్త ముక్కలుగా నరికి మూసీలో పడేసిన ఘటనను జాతీయ మహిళా కమిషన్(NCW) సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్‌కర్ లేఖ రాశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, పారదర్శకంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటు స్వాతి శరీర భాగాల కోసం SDRF బృందం మూసీలో గాలిస్తోంది.