News August 26, 2025
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలోని 315 ఎంబీఏ కాలేజీల్లో 25,991 సీట్లు, 90 ఎంసీఏ కాలేజీల్లో 6,404 సీట్లు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. MBA, ఎంసీఏల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. నిన్నటి వరకు 22,563 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,301 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని వెల్లడించారు.
Similar News
News August 26, 2025
అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం: RRR

AP: ప.గో. జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు. ‘భీమవరంలో కట్టకుండా ఉండి తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి భీమవరంలో సరిపడా స్థలం అందుబాటులో లేదు. ఈ నిర్మాణంతో వ్యక్తిగతంగా నాకు ఏ లబ్ధి జరగదు. ఈ నిర్మాణానికి ప్రాసెస్ పూర్తయింది. దీన్ని ఆపి అభివృద్ధిని అడ్డుకుంటామంటే మీ ఇష్టం’ అని తెలిపారు.
News August 26, 2025
బిహార్ ఎన్నికలకు ముందే బీజేపీకి కొత్త చీఫ్!

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించాలని BJP అధిష్ఠానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2020 నుంచి JP నడ్డా ఈ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి అధ్యక్షుడి ఎంపికకు ఇప్పటికే కొంతమందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక తర్వాత జాతీయ, పలు రాష్ట్రాల అధ్యక్షుల నియామక ప్రక్రియ తిరిగి స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాయి.
News August 26, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సుమోటోగా స్వీకరించిన NCW

TG: గర్భవతైన భార్య స్వాతిని భర్త ముక్కలుగా నరికి మూసీలో పడేసిన ఘటనను జాతీయ మహిళా కమిషన్(NCW) సుమోటోగా స్వీకరించింది. రాష్ట్ర డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్‌కర్ లేఖ రాశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, పారదర్శకంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటు స్వాతి శరీర భాగాల కోసం SDRF బృందం మూసీలో గాలిస్తోంది.