News April 2, 2024

తిరుపతి జిల్లాకు రానున్న సీఎం జగన్

image

తిరుపతి జిల్లాలోని తడ, నాయుడుపేటలో ఈనెల 4న తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్ధం సభ ఏర్పాట్లను కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డితో పాటు పలువుర నాయకులు కలిసి సభాప్రాంగణాన్ని పరిశీలించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News October 16, 2025

నుడా వీసీగా వెంకటేశ్వర్లు

image

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) వైస్ ఛైర్మన్(వీసీ)గా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నుడా పరిధిలో పదుల సంఖ్యలో లేఅవుట్లకు అనుమతులు ఆగిపోయాయి. వీసీ నియామకంతో వీటికి మోక్షం లభించే అవకాశముంది.

News October 15, 2025

నెల్లూరులో మరోసారి యూరియా కొరత..?

image

నెల్లూరు జిల్లాలో రైతులకు ఎకరాకు 3బస్తాల చొప్పున యూరియానే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 6బస్తాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన 94 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు 74 వేల మెట్రిక్ టన్నులకే ప్రతిపాదనలు పంపారు. 20వేల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడితే యూరియా కోసం రైతులు అవస్థలు పడక తప్పదు.

News October 15, 2025

సంగం టీచర్, విద్యార్థికి అరుదైన అవకాశం

image

నెల్లూరు జిల్లా సంగం జడ్పీ స్కూల్ సోషల్ టీచర్ సుబ్రహ్మణ్యం, పదో తరగతి విద్యార్థి యశ్వంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. కర్నూలులో పీఎం మోదీ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న జీఎస్టీ రీఫార్మ్ 2.0 సభకు వీరిద్దరూ ఎంపికయ్యారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ప్రధాని సభా ప్రాంగణంలో వీరిద్దరూ వివరించనున్నారు. ఈక్రమంలో కర్నూలుకు బయల్దేరి వెళ్లారు.