News August 26, 2025
ఇటిక్యాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిసర ప్రాంతాలలో పులి సంచారం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మన్యమయ్య అన్నారు. సోమవారం ఆయన ఇటిక్యాల మండల కేంద్రానికి శివారులోని పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. పులి అని నమ్మడానికి ఆధారాలు ఏవి కనిపించడం లేదన్నారు. చూసిన వాళ్లు మాత్రమే పులి ఉందని చెప్తున్నారని ఆయన అన్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 26, 2025
లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం: DMHO

లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకమని DMHO డా. బి. కళావతి బాయి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్ధారణ చట్టం పరిధి జిల్లా అడ్వైజరి కమిటి సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 26, 2025
విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.
News August 26, 2025
గుండెలను కలిచివేసే దృశ్యం: KTR

TG: రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతోందంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఓ చిత్రాన్ని Xలో షేర్ చేశారు. ‘గుండెలను కలిచివేసే దృశ్యం. విద్యార్థి స్కూల్‌కు వెళ్లకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడాల్సిన దుస్థితి. కాంగ్రెస్, BJP ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయి. సమయానికి ఎరువులు ఇవ్వకుండా లక్షలాది మందిని అంతులేని లైన్లలో నిలబెట్టాయి. మన రైతులకు గౌరవం దక్కాలి.. ఇబ్బందులు కాదు’ అని విమర్శించారు.