News August 26, 2025
హైకోర్టును ఆశ్రయించిన శ్రీదేవీ భర్త బోనీ కపూర్

దివంగత నటి శ్రీదేవీ భర్త, నిర్మాత బోనీ కపూర్ మద్రాస్ HCని ఆశ్రయించారు. 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో శ్రీదేవీ కొనుగోలు చేసిన స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహశీల్దార్‌ను ఆదేశించింది. కాగా ముదలైర్ అనే వ్యక్తి వద్ద శ్రీదేవీ భూమి కొనగా ఇప్పుడు ఆయన కుమారులు స్థలంపై హక్కు తమదేనంటున్నారు.
Similar News
News August 26, 2025
సహస్ర మర్డర్.. క్రిమినల్ కావాలనేదే బాలుడి గోల్!

TG: కూకట్‌పల్లి బాలిక <<17485132>>సహస్ర<<>> హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు రాసిన లెటర్‌తో హత్యకు సంబంధం లేదని పోలీసులు తేల్చారు. వేరే ఇంట్లో చోరీ చేయాలని లెటర్ రాసుకున్నాడని తెలిపారు. కాగా పోలీసులు అతడిపై SC, ST కేసు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. క్రిమినల్ కావాలనేదే బాలుడి గోల్ అని తెలుస్తోంది. మరోవైపు ఉద్దేశపూర్వకంగానే హత్యకు పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
News August 26, 2025
అందుకే ‘మాస్ జాతర’ వాయిదా వేశాం: మేకర్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో సమ్మెతో పాటు మూవీ ప్రొడక్షన్‌లో జాప్యం వల్ల సినిమా రేపు రిలీజ్ చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. అతిపెద్ద మాస్ విందును అందించేందుకు తమ బృందం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని, త్వరలో కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపింది.
News August 26, 2025
IPS అధికారి సంజయ్‌కి రిమాండ్

AP: IPS అధికారి సంజయ్‌కి విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసిన సమయంలో, సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు నిధుల మంజూరులో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేయగా సంజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ముందస్తు బెయిల్ దొరక్కపోవడంతో ఇటీవల ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.