News August 26, 2025
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతల ప్రసంగాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతల ప్రసంగాలు సాగాయి. జనహిత పాదయాత్రలో భాగంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించిన నేతలంతా స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని, ప్రజలు పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి నేతలు రాలేదని, స్థానిక ఎన్నికల గురించి వచ్చారని పలువురు చర్చించుకున్నారు.
Similar News
News August 26, 2025
గణేశ్ ఉత్సవాలు ఇలా మొదలయ్యాయి!

పశ్చిమ భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ప్రజలను ఏకం చేసేందుకు బాల గంగాధర్ తిలక్ 1893లో గణేశ్ చతుర్థి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ కలిసి జరుపుకునే ఓ సామాజిక ఉత్సవంగా మార్చారు. మతపరమైన వేడుకను ప్రజలందరూ కలిసి నిర్వహించడం ద్వారా వారికి ఏకత్వాన్ని, దేశభక్తిని గుర్తు చేశారు. ఆంగ్లేయులు రాజకీయ సమావేశాలను నిషేధించడంతో ఈ ఉత్సవాల ద్వారా జాతీయవాద ప్రసంగాలతో తిలక్ స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపారు.
News August 26, 2025
పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ: ASF కలెక్టర్

ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్‌లోని ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్స్‌లకు మొబైల్స్ అందజేశారు. ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరింత పారదర్శకంగా చేపట్టేందుకు మొబైల్స్ అందజేసిందని తెలిపారు.
News August 26, 2025
HYD: కాలేజీ యాజమాన్యాలపై HRC సీరియస్

సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీ యాజమాన్యాలపై హెచ్ఆర్‌సీ సీరియస్ అయ్యింది. స్కాలర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ రాలేదని విద్యార్థుల టీసీ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలానగర్‌లోని గౌతమీ డిగ్రీ కళాశాల, బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఫార్మసీ కాలేజీపై చర్యలకు సిద్ధమైంది. కాలేజీ ఛైర్మన్, ప్రిన్సిపల్ 28న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.